తనకు అసంతృప్తి లేదన్న హరికృష్ణ, మహానాడుకు సీనియర్లు డుమ్మా

మహానాడులోనే తాను భోజనం చేశానని ఆయన చెప్పారు. ఓ పెళ్లికి హాజరు కావాల్సి ఉండడంతో ముందుగా వెళ్లిపోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కొంత మంది సీనియర్లు మహానాడుకు డుమ్మా కొట్టారు. రాజమండ్రి మేయర్ వ్యవహారంలో చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మహానాడుకు రాలేదు. చంద్రబాబుతో ఆయన జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆయన పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇదిలా వుంటే, తెలంగాణకు చెందిన శాసనసభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, జైపాల్ యాదవ్, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి కూడా మహానాడుకు హాజరు కాలేదు. హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న పార్టీ సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధపడ్డారు.