భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!!

భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ప్రమాదమే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ పై పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులు, డ్రోన్ లను ప్రయోగించింది. ఇప్పటివరకు పాకిస్థాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా ఉంది. ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా సరఫరా చేసినవే కావడం గమనార్హం. గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్థాన్ తన ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది. అయితే తాజాగా ఓ సంచలన నివేదిక బయటకు వచ్చింది.


భారత్ కు వ్యతిరేకంగా చైనా నుండి పాకిస్థాన్ రహస్యంగా అణు సహాయం కోరినట్లు నివేదిక వెల్లడించింది. 'డ్రాప్ సైట్' అనే పరిశోధనాత్మక సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ జలాంతర్గామి ఆధారిత స్ట్రైక్ సిస్టమ్స్‌ తో సహా అధునాతన అణు సామర్థ్యాల కోసం సాయం కోరింది. అయితే చైనా ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. ప్రపంచ అణు ఆయుధ వ్యాప్తి నిరోధక నిబద్ధతలను చైనా తన నిర్ణయానికి కారణంగా చూపింది. దక్షిణాసియాలో అణు వ్యాప్తికి ప్రత్యక్షంగా సహకరించినట్లవుతుందనే భయం దీని వెనుక ఉంది. లీకైన కేబుల్ ప్రకారం.. పాకిస్థాన్ ముఖ్యంగా సముద్ర ఆధారిత అణు "సెకండ్-స్ట్రైక్" సామర్థ్య సాయం కోరింది. తొలిదాడి తర్వాత కూడా అణు ప్రతిస్పందనను ప్రారంభించడమే ఈ సామర్థ్యం. అణు వ్యూహంలో కీలకం, భూ, వాయు అణు ఆస్తులు ధ్వంసమైనా ప్రతీకారం తీర్చుకోగలదు. గుర్తించలేని అణు జలాంతర్గాముల ద్వారా ఈ సామర్థ్యం సాధ్యమవుతుంది.

Pakistan Seeks Nuclear Weapons from China to Counter India Sensational Report Creates Global Buzz

భారత్ ఇప్పటికే INS అరిహంత్ వంటి జలాంతర్గాములతో ఈ రంగంలో గణనీయ పురోగతి సాధించి, తన అణు త్రయంలో కీలక భాగంగా మారింది. దీనికి విరుద్ధంగా పాకిస్థాన్ మాత్రం దశాబ్దాలుగా స్వంతంగా ఇలాంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నట్లు నివేదించారు. లీకైన పత్రం ప్రకారం అణు, సైనిక మద్దతుకు ప్రతిగా పాకిస్థాన్ గ్వాదర్ పోర్ట్‌ ను శాశ్వత సైనిక స్థావరంగా మార్చడానికి చైనాకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇలాంటి చర్య అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యతను గణనీయంగా మార్చగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+