తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కీలకనిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న పేపర్ రేషన్ కార్డుల స్థానంలో, స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లాకేంద్రాలకు చేర్చింది. త్వరలోనే ఈ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపైన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకప్రకటన చేశారు.
సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ అప్పుడే
తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏకకాలంలో కార్డుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలోనూ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి ఆరులక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనాన్ని పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వనున్న క్రమంలో జిల్లాల వారీగా ప్రణాళిక బద్ధంగా చేయాల్సిన అవసరం ఉందని, సిబ్బందిని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన గొప్ప కార్యక్రమం
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తో రేషన్ అక్రమాలు జరగకుండా అడ్డుకోవచ్చని రాష్ట్ర ఆహార భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆగస్టులోనే అన్ని జిల్లాలలో పంపిణీ
అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులు అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని, కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా చేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు 15వ తేదీ నుండి అన్ని జిల్లాలలో పంపిణీ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర ఆహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా పరిగణిస్తున్నారు.
అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్న మంత్రి
అర్హులైన వారికి ప్రభుత్వ ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు సమర్థంగా అందేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి, కోట్లాది మంది ప్రజలకు ఈ ప్రయోజనం సక్రమంగా అందేలా చూడాలని మంత్రి సూచించారు. ఆగస్టు 15నాటికి అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications