రేషన్ కార్డు లేకున్నా, తక్కువ ధరకే పంపిణీ- ఇదొక్కటి చాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిపోతున్న ధరల వేళ సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా రైతు బజార్లతో సహా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా.. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా సామాన్యులకు బియ్యం అమ్మకాలు జరిగే విధంగా మార్పులు చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కీలక మార్గదర్శకాలు వెల్లడించింది.
ప్రభుత్వం నాణ్యమైన బియ్యం తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసింది. విశాఖ, విజయవాడ, రాజమహేంద్ర వరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేసారు. అయితే.. ఈ కేంద్రాల్లో తెల్ల రేషన్ కార్డు లేకపోయినా.. ఆధార్ కార్డు ఉంటే చాలని.. ఈ ప్రత్యేక కేంద్రాల్లో బియ్యం పొందవచ్చని మంత్రి మనోహర్ స్పష్టం చేసారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగాయని చెప్పారు. దీంతో, ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా BPT స్టీమ్ బియ్యం కిలో రూ.52కు, BPT ముడి బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

త్వరలో మీ మార్ట్స్ ఏర్పాటు
ఈ ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించిన అయిదు రోజుల వ్యవధిలోనే 14 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు జరిగాయని మనోహర్ వివరించారు. కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు అధిక నాణ్యత గల స్టీమ్ బియ్యం మరో రెండు నెలల కాలంలో ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. చౌక ధరల దుకాణాలను మీ మార్ట్స్ గా మార్పు చేస్తున్నట్లు వివరించారు. ఈ స్టోర్స్ లో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు త్వరలోనే రాయితీ ధరపై కందిపప్పు, పామాయిల్ అందుబాటులోకి తెస్తామని వివరించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు సైతం ఆధార్ ద్వారా ప్రత్యేక కేంద్రాల్లో బియ్యం విక్రయాలు చేయటం ద్వారా అందరికీ లబ్ది అందుతుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో.. ఈ కేంద్రాల ద్వారా విక్రయాలను ప్రభుత్వం నిత్యం పరిశీలన చేస్తుందని చెప్పారు.



Click it and Unblock the Notifications