అమెరికా నేవీ షిప్ రాకతో థాయిలాండ్ లో సెక్స్ వర్కర్లు అరెస్ట్.. ఎందుకో తెలుసా..?
అమెరికా నావికాదళానికి చెందిన "యూఎస్ఎస్ అబ్రహం లింకన్" యుద్ధనౌక దాదాపు 286 రోజులు సముద్రంలో గడిపిన తర్వాత తొలిసారిగా థాయిలాండ్ లోని పటాయా పోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. పటాయా నగరం వ్యాప్తంగా వ్యభిచార నెట్ వర్క్ లు, సెక్స్ వర్కర్లపై పోలీసులు పెద్దఎత్తున దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ కు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక ఆపరేషన్లకు మద్దతుగా దాదాపు 286 రోజుల పాటు సముద్రంలోనే గడిపిన ఈ భారీ యుద్ధనౌక బుధవారం ఉదయం థాయిలాండ్ లోని లామ్ చబాంగ్ పోర్టుకు చేరుకుంది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు సుమారు 5,000 మంది యూఎస్ నావికులు, మెరైన్లు, పైలట్లు పటాయా తీరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో వారాంతంలో సెక్స్ ట్రేడ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రాస్టిట్యూట్ సెంటర్లపై దాడులు చేపట్టి 40 నుంచి 50 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.

థాయిలాండ్ లో వ్యభిచారం ఇల్లీగల్.. అయినా సెక్స్ ట్రేడ్ ను పూర్తిగా అడ్డుకోవడం సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పటాయా బీచ్ రిసార్టు సమీపంలో ఆ నౌకను ఉంచారు. ఇక్కడే అమెరికా నేవికులు సేద తీరనున్నారు. ఇక్కడ నైట్ లైఫ్, సెక్స్ టూరిజంకు కేంద్రమైన పటాయాలో యుద్ధనౌకను డాక్ చేయడంతో సిటీలోని బార్లు, రెస్టారెంట్లు ఇప్పుడు బిజీ కానున్నాయి. గతంలో వియత్నాం యుద్దం సమయంలోనూ ఇక్కడ దాదాపు 50 వేల మంది సైనికులతో కూడిన యుద్ధ నౌకను డాక్ చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య తక్కువే .. ఇక అమెరికా నావికుల రాకతో పటాయాలో మళ్లీ టూరిజం ఊపందుకుంది. ఇన్నిరోజులూ ఇరాన్- అమెరికా యుద్ధ ప్రభావం ఈ సిటీపై పడింది. టూరిజం తగ్గింది.
ఈ క్రమంలో అమెరికా నావికులు ఇక్కడ సేద తీరితే తమ వ్యాపారం మెరుగుపడుతుందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ వాళ్లు కొంత డబ్బు ఖర్చు పెడతారన్న ఆశ ఉందని చెబుతున్నారు. ఇక అమెరికా నావికుల రాకతో థాయి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. థాయిలాండ్ లోని కొన్ని ప్రదేశాలకు వారికి అనుమతిని నిషేధించింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడి పోలీసులు దాడులు నిర్వహించారు. పటాయాలోనే దాదాపు పాతిక వేల నుంచి యాభై వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు సమాచారం. ఇక అమెరికా నావికులకు మాంసం షాపులు, కొన్ని ఆటలైన వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కైయింగ్, బంగీ జంపింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ లను కూడా నిషేధించారు.
ఇక అమెరికా నావికులను పోర్టు నుంచి పటాయాకు తీసుకొచ్చేందుకు మొత్తం 40 బస్సులను థాయిలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు హోటల్స్ ను వారు బస చేసేందుకు సిద్ధం చేసింది. ఈ మేరకు వందలాది మంది థాయి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications