Mahendragiri Varahi First Review: దైవత్వం + మిస్టరీ + థ్రిల్లర్.. 'ఇరుముడి'కి మించి..
అక్కినేని హీరో సుమంత్ ఇటీవలి కాలంలో హిట్ సినిమాలతో వస్తున్నారు. ఇటీవల న్యూటన్స్ థర్డ్ లా అనే చిత్రంతో అలరించిన ఆయన అంతకుముందు అనగనగా, సీతారామం, కపటధారి, సుబ్రహ్మణ్యపురం, మళ్లీ రావా తదితర సినిమాలతో అలరించారు. ప్రస్తుతం ఆయన నటించిన 'మహేంద్రగిరి వారాహి' సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దైవత్వం + మిస్టరీ + థ్రిల్లర్ కథాంశాలపై తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేంద్రగిరి వారాహి చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు చూశారు. యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశారు.

అయితే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరి అనే రాజవంశంలో ఉన్న ప్రతి మగ బిడ్డ 33 సంవత్సరాలకు అనుమానస్పదంగా చనిపోతూ ఉంటారు. ఇలా 150 సంవత్సరాల నుంచి ఆచారం జరుగుతూ వస్తోంది. ఇక ఇదంతా వారాహి అమ్మవారు ఆ కుటుంబానికి పెట్టిన శాపమేనని గ్రామస్థులు విశ్వసిస్తుంటారు. ఇక దైవత్వం + మిస్టరీ + థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు స్టోరీని రాసుకున్నట్లు తెలుస్తోంది. 150 ఏళ్లుగా కొనసాగుతున్న మరణాల మిస్టరీ.. వారాహి అమ్మవారి శాపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి..? ఆ మిస్టరీని ఛేదించేందుకు సుమంత్ చేసే ప్రయత్నం ఏంటి..? లాంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుందని టాక్.
మహేంద్రగిరి వారాహి మూవీ ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉందని.. సెకండాఫ్ లో హై ఎలిమెంట్స్, ట్విస్టులు బాగా ఉన్నాయని సెన్సార్ బృందం నుంచి టాక్ వస్తోంది. మొత్తానికి సుమంత్ హిట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సుమంత్ ఇంటెన్స్ లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు సమాచారం. అలాగే ఐశ్వర్య రాజేష్ పాత్ర సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతుందట. ఇక చివర్లో సిద్ధు జొన్నలగడ్డ సర్‌ప్రైజ్ ఎంట్రీ సినిమాకు మరో హైలెట్ అని టాక్. బీజీఎం, విజువల్స్, వీఎఫ్ ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా చక్కని పనితనంతో సినిమాకు గ్రాండియర్ తీసుకొచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 11 న థియేటర్లలో విడుదల కానున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో చూడాలి.












Click it and Unblock the Notifications