ఉద్యోగులతో గ్యాప్ పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఆందోళన బాటలో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్, డీఏ.. ఇలా ఎటు చూసినా బకాయిలు, పెండింగ్ అంశాలే కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం (AP Govt) వెనువెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇవన్నీ పెండింగ్ సమస్యలుగా మారిపోయాయి. వీటిపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించకుంటే.. వారిపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలాగని ప్రశ్నిస్తే ప్రభుత్వం దృష్టిలో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగితే జరిగిందని భావించి తాజాగా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మూడు దశల ఉద్యమాన్ని ప్రకటించారు. అన్నట్లుగానే నిరసనలు ప్రారంభించేశారు.

జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్-
జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్-

ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా ప్రభుత్వం ఉద్యోగుల (employees) పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోల్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. దీంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళనలు, తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన నిరసనల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.

AP Govt Plans Key Talks with Employee Leaders as Differences Widen Over Pending Issues
ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!
ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తనను కలిసిన ఉద్యోగ నేతలతో వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని నేతలు మంత్రిని కోరారు. వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేకసార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విషయం మరోసారి గుర్తుచేశారు. దీనిపై మంత్రి అనగాని స్పందిస్తూ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులతో సానుకూల చర్చలు జరిపి న్యాయం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+