నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో మరో 15 ఉద్యోగ ప్రకటనలు.. గెట్ రెడీ!
తెలంగాణా ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించటంపైన పూర్తిగా దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ ఇస్తామని, ఉద్యోగాల భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలో శాఖలవారీగా ఉద్యోగాల భర్తీపైన ఫోకస్ పెట్టింది.
నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త
అందులో భాగంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలో మరో 15 ఉద్యోగ ప్రకటనలు జారీ చెయ్యటానికి టీజీపీఎస్సీ సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తీపి కబురుగా దీనిని చెప్పొచ్చు. టీజీపీఎస్సీ మరో 15 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవసరమైన కసరత్తును పూర్తి చేసింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నుంచి ఈ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

15 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి కసరత్తు
ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది నోటిఫికేషన్లు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు 15 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, మరిన్ని పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ 3,800 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీట్ అధికారి పోస్టులు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందిన ఉద్యోగాలు కూడా భర్తీ కానున్నాయి.
నెలకు రెండు లేదా మూడు చొప్పున దశలవారీగా జాబ్ నోటిఫికేషన్లు
నెలకు రెండు లేదా మూడు చొప్పున దశలవారీగా ప్రకటనలు వెలువరించనున్నారు. ఇప్పటికే వెలువడిన తొమ్మిది నోటిఫికేషన్లకు దరఖాస్తులు ముగిశాయి. వాటికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు ప్రాథమిక కీ ప్రకారం మార్కులు స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాట్లు చేశారు. బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహించి మార్కులను నార్మలైజేషన్ పద్ధతిలో లెక్కించనున్నారు.
టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చూసి దరఖాస్తు
అలాగే ఇటీవల టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 7,437 ఎస్సై కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడిన వెంటనే టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవాలి. మరెందుకు ఆలస్యం .. త్వరలో జాబ్ నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో గెట్ రెడీ.












Click it and Unblock the Notifications