అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్..!
భారత్ తన ఇంధన భద్రతను స్పష్టం చేస్తూ.. అమెరికా ఆంక్షల మినహాయింపుతో సంబంధం లేకుండా రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రష్యా ముడి చమురు సేకరణకు అమెరికా మినహాయింపు పొడిగింపును భారత్ కోరిందని బ్లూమ్ బెర్గ్ నివేదించిన కొద్ది రోజులకే, ఈ కీలక ప్రకటనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ.. మినహాయింపు కాలానికి ముందే.. ఆ సమయంలో ఇప్పుడు కూడా భారత్ రష్యా నుండి చమురును సేకరిస్తోందని స్పష్టం చేశారు. రాయిటర్స్ ప్రకారం "రష్యాపై అమెరికన్ మినహాయింపుకు సంబంధించి, మేము గతంలో రష్యా నుండి కొనుగోలు చేస్తున్నామని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అంటే మినహాయింపుకు ముందు కూడా.. మినహాయింపు సమయంలో కూడా.. ఇప్పుడు కూడా" అని పేర్కొన్నారు.
భారత్ చమురు కొనుగోళ్లు ప్రధానంగా వాణిజ్యపరమైన లాభాపేక్ష, ఆర్థిక సాధ్యతపై ఆధారపడి ఉంటాయని శర్మ నొక్కి చెప్పారు. దేశానికి తగినంత ముడి చమురు నిల్వలు లభించాయని, కొరత లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. వాషింగ్టన్ మొదట మార్చిలో రష్యా చమురు దిగుమతులపై మినహాయింపును ఆమోదించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించి, అదనపు ముడి చమురు లభ్యతకు వీలు కల్పించడమే ఈ మినహాయింపు లక్ష్యం. ఈ మినహాయింపు మే 16న ముగిసింది. రష్యా చమురుపై నేరుగా ఆంక్షలు లేవు.
అయినప్పటికీ ఉక్రెయిన్ సంక్షోభంపై మాస్కోను ఏకాకిని చేసే ప్రయత్నాలలో భాగంగా, రాయితీతో కూడిన రష్యా ముడిచమురు కొనుగోళ్లను తగ్గించాలని ట్రంప్ పరిపాలన భారతదేశాన్ని నిలకడగా ప్రోత్సహించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. హోర్ముజ్ జలసంధిలో దాదాపు 75 రోజులుగా కొనసాగుతున్న అంతరాయాలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, మినహాయింపును కొనసాగించాలని భారత్ అమెరికాను కోరినట్లు వార్తలు వచ్చాయి.

భారత్.. రష్యా ముడిచమురు కొనుగోళ్లు అధికంగా కొనసాగుతున్నాయి. కెప్లర్ డేటా ప్రకారం, మే నెలలో భారతదేశంలోకి రష్యా చమురు ప్రవాహాలు రికార్డు స్థాయిలో రోజుకు 2.3 మిలియన్ బారెళ్లకు చేరుకున్నాయి. గతంలో లోడ్ చేయబడిన సరుకులపై సడలింపు ఈ పెరుగుదలకు ప్రధానంగా తోడ్పడింది. సగటున ఈ దిగుమతులు రోజుకు సుమారు 1.9 మిలియన్ బారెళ్లుగా ఉండవచ్చని కెప్లర్ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications