PM Modi: ప్రధాని మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజాగా నార్వేలో ప్రధాని మోదీ పర్యటించారు. ప్రధాని మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ అవార్డును అందజేశారు. అంతర్జాతీయంగా ఆయనకు లభించిన 32 వ అవార్డు ఇది కావడం విదేశం. ఇటీవల స్వీడన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ దేశ అత్యున్నత పురస్కారం "రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్" తో సత్కరించిన విషయం తెలిసిందే. అంతకుముందు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం నిర్వహించారు.
క్లిష్ట సమయంలో భారత్ కు నార్వే అండగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నార్వే వ్యవహరించిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో అండగా నిలిచినందుకు నార్వేకు కృతజ్ఞతలు తెలిపారు. నార్వే- భారత్ మధ్య సాంకేతికత, పెట్టుబడులు,ఇంజినీరింగ్, పరిశోధన విభాగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. భారత్- నార్వే మధ్య గ్రీన్ స్ట్రేటజీ కారణంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరోవైపు విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మే 19-20 మధ్య ఇటలీ వెళ్లనున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియా మట్టరెల్లాలతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను సమీక్షించనున్నారు. ఇటలీ పర్యటనతో ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగుస్తుంది.












Click it and Unblock the Notifications