ఆర్ధిక మాంద్యం వల్ల పోయిన ఉద్యోగాల కన్నా తర్వాత వచ్చినవే ఎక్కువ

గత 15 ఏళ్లల్లో నెట్ వల్ల 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే.. 12 లక్షల ఉద్యోగాలు లభించాయి. నికరంగా 7 లక్షల ఉద్యోగాలను అంతర్జాలం సృష్టించిందని మెకిన్సే తెలిపింది. జీ8 దేశాలతోపాటు బ్రెజిల్, చైనా, భారత్, దక్షిణ కొరియా, స్వీడన్‌లలో అధ్యయనం నిర్వహించారు. ఈ 13 దేశాల్లో సగటున ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తిలో ఇంటర్నెట్ వాటా 3.4% ఉంది. ఇంధనం, వ్యవసాయం వంటి అనేక రంగాల వాటా కంటే ఇది అధికం. కాగా పేదరికాన్ని తగ్గించడానికి, అన్ని ప్రాంతాల్లో వృద్ధిరేటు ఒకే విధంగా ఉండడానికి నెట్ విస్తరణ కీలకమని మిలినియం లక్ష్యాల్లో ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి ప్రస్తుత నెట్ కనెక్షన్ ఉంది.












Click it and Unblock the Notifications