టిడిపి నేత మథిర బ్రహ్మా రెడ్డి ఆత్మహత్య, విజయవాడలో ఘటన

తాను కరీంనగర్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రణభేరీకి వెళ్తున్నట్లు చెప్పి 25వ తేదీన ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన అదే రోజు విజయవాడ హోటల్ ఐలాపురంలో గది తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన రణభేరికి వెళ్లారా, లేదా అనేది తెలియడం లేదు. పురుగుల మందు తాగి బ్రహ్మా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలో ఆయన ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆయన అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.