మెట్రో పై ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్తగా 8 కారిడార్లు..162.5 కిమీ, లైన్ క్లియర్..!!
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. మెట్రో విస్తరణ పైన కీలక నిర్ణయం జరిగింది. ఇందుకు లైన్ క్లియర్ అయింది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకున్న తరుణంలో సెకండ్ ఫేజ్ కారిడార్ల డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లకు త్వరలో ఆమోదం లభించనుంది. ఈ మేరకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా 8 కారిడార్లు.. 162.5 కిలో మీటర్ల మేర విస్తరణకు రంగం సిద్దం అయింది.
హైదరాబాద్ మెట్రో విస్తరణ దిశగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పార్ట్-ఏ కింద నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు (36.8) కిలోమీటర్లు ప్రతిపా దించారు. అలాగే రాయదుర్గ్-కోకాపేట్ వరకు (11.6 కిలోమీటర్లు), ఎంజీబీఎస్-చాంద్రాయణ గుట్ట వరకు (7.5 కిలోమీటర్లు), మియాపూర్ -పటాన్‌చెరు వరకు (13.4 కిలోమీటర్లు), ఎల్‌బీ నగర్ - హయత్‌నగర్ వరకు (7.1 కిలోమీటర్లు) ప్రతిపాదించారు. కాగా, పార్ట్-బీ కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు-భారత్ ఫ్యూచర్‌సిటీ వరకు (39.6 కిలోమీటర్లు), జేబీఎస్-మేడ్చల్ వరకు (24.5 కిలోమీటర్లు), జేబీ ఎస్ - శామీర్‌పేట్ వరకు (22 కిలోమీటర్లు) చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా పార్ట్-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కిలోమీటర్లకు రూ.24,269 కోట్లు, పార్ట్-బీ కింద ప్రతిపాదించిన 3 కారిడార్లలోని 86.1 కిలోమీటర్లకు రూ.19,579 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

రెండో విడత విస్తరణలో భాగంగా
ఈ మొత్తం ప్రాజెక్టును 50:50 జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా డీపీఏలకు కేంద్రానికి పంపారు. మెట్రో నిర్వహణలో భాగంగా రూ.15వేల కోట్లతో (బ్యాంకు రుణాలు, ఎల్‌అండ్‌టీ ఈక్విటీ) ప్రాజెక్టును పూర్తిగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రభుత్వం అధీనంలోకి మెట్రో పూర్తిగా వచ్చింది. శుక్రవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆపరేషన్స్ జరుగనున్నాయి. రెండో దశ విస్తరణకు అడ్డంకిగా ఉన్న మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం కొనుగోలు చేయడంతో ప్రభుత్వ పరమైంది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లడంతో రెండో దశ అనుమతులకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.













Click it and Unblock the Notifications