వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు నాయుడు డిమాండ్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, దాని కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. తెలుగుజాతి అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు శ్రమించారని, ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తమ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతికి ఎన్టీ రామారావు కృషి చేశారని ఆయన అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనకు తాము పాటు పడుతామని ఆయన చెప్పారు.