హరికృష్ణకు షాక్: చంద్రబాబు వర్గం దేవినేనితో వల్లభనేని వంశీ చెట్టాపట్టాల్

మహానాడు కార్యక్రమంలో ఎడమొహం పెడమొహంగా ఉంటారని అందరూ ఊహించారు. అయితే అందుకు పూర్తి విరుద్దంగా వారిద్దరూ చెట్టా పట్టాల్ వేసుకున్నారు. దీంతో బెజవాడ పంచాయతీకి చెక్ పడినట్లయిందని పలువురు భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ వర్గం నేతగా వంశీ, చంద్రబాబునాయుడు వర్గం నేతగా దేవినేని జిల్లాలో మీడియా సాక్షిగా ఆరోపణలు చేసుకున్నారు. అయితే అనంతరం వారి మధ్య చంద్రబాబు సయోధ్య కుదిర్చినందునే వారిద్దరూ మహానాడులో కలిసి పోయి ఉన్నట్లుగా సమాచారం.
అంతేకాకుండా హరికృష్ణ వర్గం నేత అయిన వంశీ మహానాడు రెండో రోజు అలిగి వెళ్లి పోయిన తర్వాత బద్ద విరోధి అయిన దేవినేనితో చెట్టాపట్టాల్ వేయడం హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మింగుడు పడని విషయమే. మొత్తానికి బాబు తన చాతుర్యంతో బెజవాడ రాజకీయ విభేదాల సమస్యను తీర్చినట్లుగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications