వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదిహేనేళ్ల తర్వాత ఒరిస్సా ఐటి మంత్రి ఇంటర్ పాసయ్యాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramesh Majhee
భువనేశ్వర్: ఒరిస్సాలో మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియేట్ పరీక్షలు రాసి పాసైన విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రమేష్ మాఝీ సోమవారం విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో మొదటి తరగతిలో పాసయ్యారు. ఆయనకు మొత్తం 600కు గాను 376 మార్కులు వచ్చాయి. రమేష్ పదహారేళ్ల క్రితం 1995లో ఇంటర్మీడియేట్ పూర్తి చేసినప్పటికీ అన్ని విషయా(సబ్జెక్టు)లలో ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. అయితే అనంతరం ఆయన రాజకీయాలలోకి వెళ్లడం ఇటీవల మంత్రి కావడం కూడా జరిగి పోయాయి.

అయితే ఆయన మంత్రి కావడం... అందులోనూ ఐటి మంత్రి కావడంతో కనీసం ఇంటర్ అన్నా పాస్ అవాలనుకున్నాడో లేదా ఉన్నత చదువులు చదవాలనుకున్నాడో గానీ ఇటీవల పదిహేనేళ్ల తర్వాత ఇటీవల జరిగిన పరీక్షలు రాసి మొత్తానికి ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు. మంత్రిగా బిజీగా ఉంటూ కూడా పుస్తకం పట్టి చదివి పాస్ కావడం నిజంగా గొప్పే.

English summary
Orissa IT minister Ramesh Majhee passed intermediate this year after fifteen years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X