హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్లీల మెయిల్స్ పంపిన టెక్కీ అరెస్టు, నిశ్చితార్థం చెడగొట్టిన వైనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తన స్కూల్‌మేట్‌పై అశ్లీల మెయిల్స్ పంపి నిశ్చితార్థాన్ని చెడగొట్టిన టెక్కినీ హైదరాబాద్ నేర దర్యాప్తు విభాగం (సిఐడి) పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరిప్రసాద్ అనే 24 ఏళ్ల టెక్కీని ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా అతను ఇ - మెయిల్స్ పంపాడు. మార్చి 14వ తేదీన బాధితురాలు సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులకు అశ్లీల మెయిల్స్‌పై ఫిర్యాదు చేసింది.

కూకట్‌పల్లిలోని కొంత మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంప్యూటర్ల నుంచి మెయిల్స్ వెళ్తున్నట్లు గ్రహించిన పోలీసులు హరిప్రసాద్‌ను అరెస్టు చేశారు. తాను, బాధితురాలు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఒకే పాఠశాలలో చదివామని హరిప్రసాద్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. పాఠశాల విద్య ముగిసిన తర్వాత బిటెక్ చదివే రోజుల వరకు తాము కలుసుకోలేదని, ఆ తర్వాత ఆమె మొబైల్ నెంబర్ సాధించగలిగానని అతను చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో తరుచూ మాట్లాడసాగాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య సంబంధాలు తెగిపోయాయి.

ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని ఎన్నారైతో ఆమె పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న హరిప్రసాద్ జగ్గయ్యపేటలోని కొంత మంది ద్వారా పెళ్లి కుమారుడి వివరాలు తెలుసుకున్నాడు. ఇంటర్నెట్‌లో శోధించి అతని మెయిల్ ఐడి సంపాదించాడు. అప్పటి నుంచి పెళ్లి కూతురిపై అతనికి అసభ్యకరంగా, అశ్లీలంగా మెయిల్స్ పంపుతూ వచ్చాడు. ఆ మెయిల్స్‌ను ఆమెకు కూడా పంపుతూ వచ్చాడు. దీంతో నిశ్చితార్థం రద్దయింది.

English summary
Crime Investigation Department (CID) sleuths arrested a software engineer who reportedly broke the engagement of his schoolmate by sending abusive emails to her fiance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X