వైయస్ జగన్ బలం మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువే: బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుదేనని, ఆ బాధ్యతను తమపై మోపడాన్ని చూస్తుంటే కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యాడని చెప్పక తప్పదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు పెట్టాలని, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబు చూడాలని ఆయన అన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే చంద్రబాబు రాజకీయంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రమంతటా కడప ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని ఆయన అన్నారు. పరిస్థితిని దిగజార్చుకోవడం చంద్రబాబుకు మంచిది కాదని ఆయన అన్నారు. అవిశ్వాసం పెడితే ఆ సీట్లు కూడా మిగులుతాయో లేదోనని భయమని, చంద్రబాబు పరిస్థితి అన్యాయంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు అమాయకుడేమీ కాడని, చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆయన అన్నారు. మంగళవారంనాడు వైయస్ జగన్‌ను 9 మంది శాసనసభ్యులు కలిశారు.












Click it and Unblock the Notifications