హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారసత్వంపై చంద్రబాబు తగ్గినా వెనక్కి తగ్గని హరికృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు లోకేష్ కుమార్ రాజకీయ ఆరంగేట్రంపై వెనక్కి తగ్గినా నందమూరి - నారా కుటుంబాల మధ్య వారసత్వ పోరు కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన 30న మహానాడులో వారసత్వ పోరు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మూడు రోజుల మహానాడులో భాగంగా హరికృష్ణ రెండో రోజు వచ్చి వేదికపై ఆసీనుడు అయినప్పటికీ టిడిపి నేతలు ప్రసంగించమని ఎంతగా పట్టుబట్టినా హరికృష్ణ ప్రసంగించడానికి ఇష్ట పడలేదు. వారు మరింత ఒత్తిడి చేయడంతో హడావుడిగా అక్కడి నుండి లేచి వెళ్లి పోయారు. అయితే నందమూరి వంశానికి ధీటుగా లోకేష్ కుమార్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంతో హరికృష్ణ బాబుపై అలిగినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ వ్యాపారాలు చూసుకునే లోకేష్ ఇటీవల తరుచూ రాజకీయాలలో తల దూరుస్తున్నారు. అయితే తన అనంతరం లోకేష్‌కు లైన్ క్లియర్ చేయడానికి చంద్రబాబు ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. మహానాడులో లోకేష్ కుమార్ ఫోటోలు కన్పించడం హరికృష్ణకు మరింత ఆగ్రహం తెప్పించినట్టుగా కనిపిస్తోంది.

తమ అండతో ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలు దొరక బుచ్చుకొని ఆ తర్వాత చంద్రబాబు తమను అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకొని తర్వాత తమను పక్కన పెట్టడం పట్ల కూడా హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఎన్నికల్లో నందమూరి కుటుంబాన్ని ప్రచారానికి ఉపయోగించుకొని ఆ తర్వాత పక్కన పెట్టడం ద్వారా చంద్రబాబు తన అధికారం కోసం తమను యూజ్ త్రో గా వాడుకుంటున్నారన్న ఆవేదన హరికృష్ణలో ఉందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా బాలకృష్ణ తెరపైకి వచ్చినప్పటికీ లక్ష్మీ పార్వతిని బూచీగా చూపి బాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే బాలకృష్ణ పేరు మళ్లీ రాకుండా ఆయనతో వియ్యమందుకొని బాలయ్యను సైలెంట్ చేశాడు. అదే తరహాలో నందమూరి వంశం కారణంగా ఇటీవల స్టార్ ఇమేజ్ పొందిన జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా తన సమీప బంధువు నార్నే వారి కుటుంబంతో వియ్యమందేలా చేసి హరికృష్ణను, జూ.ఎన్టీఆర్‌ను సైలెంట్ చేద్దామని అనుకున్నప్పటికీ బాబు ప్లాన్ బెడిసి కొట్టినట్టుగా తెలుస్తోంది.

జూనియర్ పెళ్లి అనంతరం మహానాడులో కూడా హరికృష్ణ తన అసంతృప్తిని మౌనం ద్వారా బయట పెట్టారు. మరోవైపు సినిమా షూటింగ్ బిజీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరై తన తండ్రికి అండగా ఉంటున్నానని చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తోంది. హరికృష్ణ, జూనియర్ అసంతృప్తి గమనించిన బాబు మహానాడు వేదికపై లోకేష్ కుమార్ ఫోటోలు పెట్టవద్దని హెచ్చరించి లోకేష్ - ఎన్టీఆర్ మధ్య కొనసాగుతున్న వారసత్వ పోరుకు ముగింపు పలకాలని అనుకున్నప్పటికీ హరికృష్ణ మాత్రం వెనక్కి తగ్గినట్లుగా కనిపించడం లేదు. బాబు ఇప్పుడు అలా చెప్పినప్పటికీ జూనియర్‌ను పక్కన పెట్టి లోకేష్ తెరంగేట్రం కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తాడనే అనుమానాలు హరికృష్ణలో ఉన్నందువల్లే ఆయన బాబు మాటలపై విశ్వాసంగా లేరని, అందుకే ఆయన బాబుపై ఆగ్రహం, ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
TDP president Chandrababu Naidu step back on Lokesh Kumar political entry, where as Harikrishna is continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X