టిడిపిని టార్గెట్ చేసిన కోదండరామ్, మోసం చేస్తోందని ఆరోపణ

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీకి స్పష్టత లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ నెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా తాండూరులో తలపెట్టిన తెలంగాణ రణభేరి బహిరంగ సభను ఆయన వ్యతిరేకించారు. ఈ సభకు ప్రజలు సహకరించవద్దని ఆయన కోరారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రి పదవికి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. మిగతా తెలంగాణ మంత్రులు కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాలయాపన చేయవద్దని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జెఎసి కమిటీలు ప్రచారంలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం నుంచి సస్పెండైన నాగం జనార్దన్ రెడ్డి ఆదిలాబాద్‌లో నిర్వహించే తెలంగాణ సభకు వెళ్లే విషయంపై జెఎసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+