చంద్రబాబుకు ఝలక్, నాగం జనార్దన్ రెడ్డి వెంట వేణుగోపాలాచారి

భవిష్యత్ కార్యాచరణ, ఆదిలాబాద్ సభ నిర్వహణపై చర్చించేందుకు మంగళవారమిక్కడ నాగం నివాసంలో సమావేశం జరిగింది. తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, కరీంనగర్ తెలుగుదేశం నేత జైపాల్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి వేణుగోపాలాచారి కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆదిలాబాద్ సభకు 13వ తేదీని ఖరారు చేసి, దాని ఏర్పాట్లపై చర్చించారు. 13వ తేదీ సాయంత్రం మూడు గంటలకు ఆదిలాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో కూడా ఒక సభ నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా జూన్ 10న సభ నిర్వహించనున్నందున పోటీ సమావేశాలు పెట్టినట్లు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో దీనిపై సుముఖత చూపలేదని తెలిసింది.
తెలంగాణ సమస్యను కేంద్రమే తేల్చాలని, లేకుంటే చేతకాదని చెప్పాలంటూ మహానాడులో చంద్రబాబు ప్రకటించడం ద్వారా ఆయన సమైక్యవాదిగా తేలిపోయిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అంటే ప్యాకేజీలాంటిదేనని, అదే అర్థంలో ఆయన మాట్లాడారన్నారు. 2008లో చేసిన తెలంగాణ తీర్మానానికి తెదేపా కట్టుబడి లేనట్లు అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications