తెలంగాణపై చంద్రబాబు మాట మార్చారు: బొత్స సత్యనారాయణ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ముందు తెలుగుదేశం పార్టీయే సరే అన్నదని ఆ తర్వాత అదే పార్టీ యూటర్న్ తీసుకున్నదని మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు మొదట సరే అని చెప్పిన టిడిపి ఆ తర్వాత కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణను ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు యు టర్న్ తీసుకున్నారని బొత్స ఆరోపించారు. తెలంగాణపై మాట మార్చింది కాంగ్రెసు కాదని చంద్రబాబే అన్నారు. తెలంగాణపై ముందు పార్టీలన్నీ తమ తమ నిర్ణయం చెప్పాలని ఆ తర్వాతే కాంగ్రెసు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో టిడిపి తీరు గోడమీది పిల్లిలా ఉందన్నారు.
అసెంబ్లీలో తమకు విశ్వాసం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టుకోవచ్చన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శీతాకాలపు సమావేశాలు నూటికి నూరుపాళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సభాపతిని ఎన్నుకోవడానికి అత్యవసర సమావేశాలు నిర్వహించరాదని ఏమైన ఆక్షేపణ ఉందా అని ప్రశ్నించారు.