ఎల్లుండి పెట్రో ధరల పెంపు ? తేల్చేసిన కేంద్రం ..!

రేపు పశ్చిమ బెంగాల్లో జరిగే రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో ఐదు రాష్ట్రాల ఎన్నికల (Five states assembly election 2026) ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ( fuel prices hike) పెంచబోతున్నారనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా దేశంలో ధరలు పెంచడం లేదని ఇప్పటికే బీజేపీ అనుకూల వర్గాలు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో పెట్రో ధరల మంట తప్పదన్న చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీరేదెప్పుడు ? చెప్పేసిన చంద్రబాబు..!
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీరేదెప్పుడు ? చెప్పేసిన చంద్రబాబు..!

ఎల్లుండి పెట్రో ధరలు పెరుగుతాయనే భయాలతో ఆదివారం రోజే 400కు పైగా పెట్రోల్ బంకుల్లో చమురు నిల్వలు ఖాళీ అయ్యాయి. కొన్ని అవుట్‌లెట్లలో డిమాండ్ 30-33 శాతం వరకు పెరిగిందని సమాచారం.కొన్ని చోట్ల భయాందోళనలతో కొనుగోళ్లు జరుగుతున్నట్లు గుర్తించామని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు.

Government Clears Air on Fuel Prices Rules Out Hike as Assembly Polls Draw to a Close
ఏపీలో మరోసారి చమురు షాక్..! వినియోగదారులకు చుక్కలు..!
ఏపీలో మరోసారి చమురు షాక్..! వినియోగదారులకు చుక్కలు..!

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. దయచేసి వదంతులను నమ్మవద్దని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. భయాందోళనలతో కొనుగోళ్లు చేయడం మానుకోండి, సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడాలని సూచించారు. డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు. ధరలు స్థిరంగా ఉన్నాయని, ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టత ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+