బిగ్ షాక్.. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సేవలు రద్దు..??
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా పేరుపొందిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో అనేక దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాలతో పాటు భారత్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లోని విమానయాన రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్తోంది. ఇంధన ధరలు పెరుగుదల కారణంగా పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని దేశంలోని పలు విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశాయి.
విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు పెరుగుదల కారణంగా దేశంలోని విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని.. తాము కార్యకలాపాలు సాగించే స్థితిలో లేమని భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడం వల్ల విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు భరించలేనంతగా పెరిగాయని వాపోతున్నాయి.

ఈ మేరకు టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియాతో సహా ప్రధాన సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఇంధన ధరలలో మార్పులు చేయకపోతే విమానాలను నడపలేమని నిలిపివేయడం లేదా రద్దు తప్పదని లేఖలో పేర్కొన్నాయి. అయితే వినానయాన సంస్థలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 5 వేల కోట్ల విలువైన ప్యాకేజీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇంధన సంక్షోభం కారణంగా విమాన టికెట్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications