వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కొత్త అస్త్రం, ముఖ్యమంత్రి నిర్ణయం

జగన్ వర్గ ఎమ్మెల్యేలకు ప్రభుత్వపరంగా సహకరించకూడదని ముఖ్యమంత్రి, మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధుల విడుదల అంశాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు క్రియాశీలక పాత్ర పోషించాలని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సభాపతికి సిఫారసు చేశారు. మరికొందరిపైనా చర్యలకు యోచిస్తున్నారు.
అందుబాటులో ఉన్న మంత్రులతో ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఎం.వెంకటరమణ, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ఎన్నిక, తెదేపా అవిశ్వాస తీర్మానం నోటీసు, సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం తదితర అంశాలపై చర్చించారు.
వైయస్ జగన్ వర్గానికి చెందిన నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఓవైపు జగన్ వెంట ఉంటూనే మరోవైపు సీఎం వద్దకు వచ్చి పనులు చేయించుకుంటూ లబ్ధి పొందుతున్నారని మంత్రులు కూడా అన్నారు.












Click it and Unblock the Notifications