జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు బొత్స సత్యనారాయణ ఉత్సాహం

తాము శాసనసభా సభ్యత్వాలను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఉప ఎన్నికలు వస్తే తమకు టికెట్లు ఇవ్వడంతో పాటు తమను గెలిపించే బాధ్యతను తీసుకోవాలని కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యులు జగన్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జగన్ నుంచి వారికి ఏ విధమైన హామీ లభించలేదని చెబుతున్నారు. జగన్ హామీ ఇవ్వనప్పుడు తామెందుకు శాసనసభా సభ్యత్వాలను కోల్పోవాలని వారు అడుగుతున్నారని, దీంతో జగన్ వెంట నడవడానికి చాలా మంది వెనకాడుతున్నారని అంటున్నారు.
జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై ఇప్పుడే వేటు వేయాలని శనివారం గాంధీభవన్‌లో అధికార ప్రతినిధుల సమావేశంలోను, అనంతపురం జిల్లా నేతల సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈనెల 20 నుంచి అనంతపురం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్న సందర్భంగా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయంలోని సత్తిబాబు చాంబర్‌లో భేటీ అయ్యారు.
ఈ నెల 15న అనంతపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రఘువీరాతో సహా ఇతర ఎమ్మెల్యేలంతా జగన్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలపై క్రమ పద్ధతిలో వేటు వేస్తామని బొత్స స్పష్టం చేశారు. ముందుగా అనర్హత నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలపై పడుతుందని, ఇది వారంలోగా ఉంటుందని నేతలతో సత్తిబాబు చెప్పారు.