వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో ఘనమైన సత్కారాన్ని పోందిన యోగ గురు అయ్యంగార్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

BKS Iyengar
బీజింగ్: ప్రస్తుత పరిస్దితులలో యోగ అనేది మెంటల్ టెంక్షన్స్ అన్నింటిని పారద్రోలడానికి బాగా ఉపయోగపడుతుందని ప్రముఖ యోగ గురువు బాబా రామ్‌దేవ్ తెలిపిన విషయం తెలిసిందే. బాబా రామ్‌దేవ్ కేవలం ఇండియాకే పరిమితం కాగా ఆయన కంటే వయసులో పెద్దవాడు ఇంటర్నేషనల్‌గా బాగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యోగా గురు బిఎస్‌కె అయ్యంగార్‌కి చైనాలో ఘనమైన సన్మానం లభించింది. అయ్యంగార్ వయసు 93 సంవత్సరాలు కాగా ఈ వయసులో కూడా ఎంతో హుషారుగా ఉండడానికి కారణం యోగ మాత్రమేనని అంటారు.

ప్రపంచం స్టేజిల మీద గత 75 సంవత్సరాలుగా యోగని టీచ్ చేస్తున్నటువంటి యోగ గురు బికెఎస్ అయ్యంగార్ యోగ టీచ్ చేయడంలో తనదైన ముద్రని వేశారు. అలాంటి గోప్పవ్యక్తి బీకేఎస్ అయ్యంగార్ బొమ్మతో నాలుగు తపాలా బిళ్లలు విడుదలచేయడం ద్వారా చైనా ఆయన ను ఘనంగా సత్కరించింది. మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అయ్యంగార్‌కు 'చైనా పోస్ట్" బీజింగ్ శాఖ ఈ స్టాంపులను బహూకరించింది. భారత్-చైనా యోగా సదస్సులో పాల్గొనేందుకుగాను తొలిసారిగా చైనాకు వెళ్లిన అయ్యంగార్ వారం రోజులుగా అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

తన కు ఈ అరుదైన గౌరవం లభించడంపై ఆయన చైనీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తంచేశారు. అయితే భారత్‌లో తన పేరిట తపాలా బిళ్లలు విడుదలచేయలేదని, ఇంగ్లండ్‌కు చెందిన తన విద్యార్థి పేరు మీద మాత్రం స్టాంపులు విడుదలచేశారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా చైనాలో యోగా పట్ల ఆకర్షితులయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, అయ్యంగార్ వద్ద యోగా నేర్చుకునేందుకు 1990ల నుంచే చాలా మంది చైనీయులు భారత్‌కు వస్తున్నారు. 93 ఏళ్ల అయ్యంగార్‌ను భారత ప్రభుత్వం ఇదివరకు పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది.

English summary
Iyengar, considered the oldest yoga teacher internationally, visited Guangzhou during his China tour where dozens of yoga practitioners prostrated themselves before him. His followers in Beijing were seen recording his speeches for uploading these on their blogs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X