గూగుల్ వాయిస్ సెర్చ్ ఇంజన్ ఫీచర్ అదుర్స్, మాటలతో సెర్చ్ చేయండి

వీటితోపాటు గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ఓ సరిక్రొత్త మైక్రోఫోన్‌ని ప్రవేశపెట్టింది. యూజర్స్ ఎవరైతే వాయిస్ ఫీచర్‌ని ఉపయోగించాలని అనుకుంటున్నారో వారు ఈ మైక్రోఫోన్‌పై క్లిక్ చేసి వారియొక్క వాయిస్‌ని వినిపించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం ఒక్క గూగుల్ క్రొమ్ బ్రౌజర్‍లో మాత్రమే వస్తుంది. ఐతే ఈ గూగుల్ సెర్చ్ వాయిస్ ఫీచర్ త్వరలో మిగిలినటువంటి బ్రౌజర్స్‌లో కూడా రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వన్ ఇండియా రీడర్స్ కోసం ప్రత్యేకంగా...
దీనితోపాటు గూగుల్ తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళ భాషల్ని బుధవారం 'అనువాద' విభాగంలో చేర్చిందని గూగుల్ శాస్త్రవేత్త ఆశిష్ వేణుగోపాల్ తెలిపారు. ''ఇప్పటికే హిందీ, మరాఠీ, మలయాళం, పంజాబీ భాషల్లో గూగుల్ అనువాద సేవలుఅందుతున్నాయి. వీటిని తాజాగా ఐదు భాషలకు విస్తరించడం ద్వారా మరో50 కోట్ల మందికి చేరువ కానున్నాం'' అని ఆశిష్ తెలిపారు. ఇకపై గూగుల్ translate సహాయంతో తొమ్మిది భారతీయ భాషల పదాలను మొత్తం 63 భాషల్లోకి అనువదించవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications