శ్రీ సత్య సాయి ట్రస్టు అఫైర్స్: శ్రీనివాసన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: సత్య సాయి ట్రస్టు సంపద తరలింపు కేసులో సభ్యుడు వి. శ్రీనివాసన్‌పై పోలీసులు ఉచ్చు బిగిస్తోంది. తనకు జారీ అయిన సమన్లపై సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని ఆయన అనంతపురం జిల్లా పోలీసులను కోరారు. ఈ నెల 27వ తేదీన ఆయన జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం ముందు హాజరు కావాల్సి ఉంది. శ్రీనివాసన్‌కు 72 గంటల గడువు ఇచ్చారు. వ్యక్తిగతమైన పనులు ఉన్నందున ఆ రోజు తాను హాజరు కాలేనని శ్రీనివాసన్ చెప్పారు.
పెనుగొండ దర్యాప్తు బృందం శుక్రవారం శ్రీనివాసన్ వ్యక్తిగత సహాయకుడు వెంకటేష్‌ను ప్రశ్నించింది. సంపద తరలింపులో అరెస్టయిన సోహన్ శెట్టికి సన్నిహితుడైన సదాశివ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. స్థానిక సిఐ మధుసూదన్ ప్రశాంతి నిలయంలో ట్రస్టు కార్యదర్శి కె. చక్రవర్తిని కలిశారు. యజర్వేద మందిరం తెరిచినప్పటి నుంచి వాహనాల రాకపోకలపై ఆయన ఆరా తీశారు.
With police tightening the noose on the high-profile members of Sathya Sai Central Trust in the money trail case, one of the members V Srinivasan has sought more time from the Anantapur district police authorities to reply to the summons served by them.
Story first published: Saturday, June 25, 2011, 15:16 [IST]