సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి: స్నేహితుడి ఇంట్లో మృతి
Technology
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరంలోని శివరాంపల్లిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం సాయంత్రం సాయిబాబానగర్‌లోని తన స్వగృహం నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ ఓ స్నేహితుడి ఇంట్లో శవమై కనిపించాడు. దీనికి సంబంధించి శివరాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం శ్రీనివాస్ మరణించిన విషయం బయటకు వచ్చింది. శ్రీనివాస్ మృతికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.