ఆర్టీఏ ఏజెంట్ మృతి, ఎంపీ లగడపాటి అనుచరులపై అనుమానం

స్థానికులు రంగనాథ్‌ను దగ్గరలోని హెల్త్ హాస్పిటల్ తరలించారు. రంగనాథ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు చెప్పారు. అయితే కారులో వచ్చిన నలుగురు లగడపాటి అనుచరులుగా రంగనాథ్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నగరంలోని ఓ కార్పోరేటర్ తమ్ముడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్దేశ్య పూర్వకంగానే తమ తండ్రి స్కూటర్‌ను కారుతో గుద్ది గొడవకు దిగి హత్య చేశారని రంగనాథ్ బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా లగడపాటి అనుచరులని మొదట చెప్పిన బంధువులు ఆ తర్వాత బెదిరింపులు రావడంతో నోరు విప్పడానికి భయపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాగా దాడికి పాల్పడ్డ వారి ఎవరో పోలీసులు బయట పెట్టడం లేదు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా రంగనాథ్ బంధువులను పరామర్శించడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చారు. కాగా దాడి తమ అనుచరుల పని కాదని ఎంపీ లగడపాటి చెప్పారు. ఆ దాడిని ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications