సాంకేతిక లోపంతో స్పైస్ జెట్ అత్యవసర లాండింగ్: విమానంలో ఎంపీలు?
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా స్పైస్ జెట్ విమానం సోమవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానం హైదరాబాద్ నుండి న్యూ ఢిల్లీకి ఉదయం 6.40 నిమిషాలకు బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఉన్నట్టు పైలట్ గమనించారు. వెంటనే విమానాన్ని పైలట్ విమానాశ్రయంలోనే దింపారు.
కాగా ఈ విమానంలో 180 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విమానంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అధికారులు ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.