UPI సరికొత్త చరిత్ర: మే నెలలో ఏకంగా..

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రారాజు 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (UPI) సరికొత్త చరిత్ర సృష్టించింది. గడిచిన మే (2026) నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరాయి. ఐపీఎల్ (IPL) మ్యాచ్‌ల సందడి, వేసవి సెలవుల ప్రయాణాలు, వినియోగదారుల కొనుగోళ్లు వంటి కారణాలతో మే నెలలో ఏకంగా రూ.29.9 లక్షల కోట్ల విలువైన 23.2 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా గణాంకాల్లో వెల్లడించింది.

అంతకుముందు ఏప్రిల్ (2026) నెలలో 22.35 బిలియన్ లావాదేవీల ద్వారా రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం జరగ్గా.. కేవలం ఒక నెల వ్యవధిలోనే యూపీఐ చెల్లింపులు మరింత ఊపందుకున్నాయి. గత ఏప్రిల్ 2025తో పోల్చి చూస్తే.. లావాదేవీల విలువలో 19 శాతం (రూ.25.14 లక్షల కోట్ల నుండి), సంఖ్య పరంగా 24 శాతం (18.67 బిలియన్ల నుండి) వృద్ధి నమోదు కావడం విశేషం.

Digital Payments Surge May 2026 UPI Transactions Touch Mega Record of Rs 29 90 Lakh Crore via NPCI

తగ్గిన సగటు లావాదేవీ పరిమాణం.. ఆందోళన అవసరం లేదు

మే నెల గణాంకాలు మార్కెట్లో ఉన్న బలమైన డిమాండ్‌ను, యూపీఐ స్థిరమైన వృద్ధి మార్గాన్ని స్పష్టం చేస్తున్నాయని క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సీఈఓ ఆకాష్ సిన్హా విశ్లేషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ప్రకారం.. యూపీఐ ద్వారా జరిగే సగటు లావాదేవీ పరిమాణం 2021లో రూ.1,848 గా ఉండగా, అది 2025 నాటికి రూ.1,313 కి తగ్గింది. అయితే, దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చిన్న చిన్న మొత్తాలకు కూడా ప్రజలు యూపీఐని విరివిగా వాడుతున్నారని అనడానికి ఇది నిదర్శనమని, ఈ వ్యవస్థ పరిపక్వతకు ఇది సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.

జూన్ 5న కీలక ప్రకటన, ఈ వారం తేలిపోనున్న భవిష్యత్తు!
జూన్ 5న కీలక ప్రకటన, ఈ వారం తేలిపోనున్న భవిష్యత్తు!

క్రెడిట్ కార్డ్ లింకేజ్.. అంతర్జాతీయ విస్తరణే తదుపరి లక్ష్యం!

యూపీఐ భవిష్యత్తు వృద్ధిపై ఆకాష్ సిన్హా మాట్లాడుతూ.. యూపీఐ ద్వారా క్రెడిట్ (రుణాలు/క్రెడిట్ కార్డ్ లింకేజ్) సేవలు అందించే ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, రాబోయే రోజుల్లో ఇది సరికొత్త లావాదేవీల విప్లవానికి దారితీస్తుందని పేర్కొన్నారు. కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి యూపీఐ దూసుకుపోతోంది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, మారిషస్‌తో సహా ఏడు దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.

సంక్షేమ పథకాలకు 'ఈ-రూపాయి', సబ్సిడీలపై ఆర్‌బీఐ సంచలన ఆర్డర్!
సంక్షేమ పథకాలకు 'ఈ-రూపాయి', సబ్సిడీలపై ఆర్‌బీఐ సంచలన ఆర్డర్!

ఎనిమిదికి పైగా దేశాల్లో క్రాస్-బోర్డర్ (అంతర్జాతీయ) యూపీఐ విస్తరిస్తోందని, దీని ద్వారా సరికొత్త చెల్లింపుల వర్గం ఈ వ్యవస్థలోకి వస్తుందని ఆయన వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ల సంయుక్త చొరవతో ఏర్పాటైన ఎన్‌పీసీఐ (NPCI).. దేశంలో ఈ రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను విజయవంతంగా నిర్వహిస్తూ సామాన్యుడికి సైతం బ్యాంకింగ్ సేవలను అరచేతిలోకి తీసుకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+