TGSPSC నోటిఫికేషన్ల జాతర, ముహూర్తం ఫిక్స్- పరీక్షల్లో కీలక మార్పులు...!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి నెలా 2, 3 నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. రేపు (మంగళవారం) మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 28 రకాల పోస్ట్‌లకు ఒక్కో ఖాళీగా, 25 రకాల పోస్ట్‌ల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ వరుసగా నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు కమీషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేసారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSSC) అభ్యర్థులకు సంబంధించి పరీక్షల నిర్వహణలో సరికొత్త విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహణ చాలా క్లిష్టమైందని, దాని బదులు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో గంట ముందు కూడా ప్రశ్నాపత్రం రూపొందించవచ్చని . అంతే కాకుండా పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు మార్కులు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో అనేక సంస్కరణలు తెస్తున్నామని, అభ్యర్థులు కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని బుర్రా వెంకటేశం సూచించారు.

దశల వారీగా నోటిఫికేషన్ల విడుదల
ఇకపై సాధ్యమైనంత వరకూ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్‌గానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై వస్తున్న విమర్శలపై కూడా చైర్మన్ స్పందించారు. టీజీపీఎస్సీ అనేది చాలా క్లిష్టమైన బాధ్యతలతో కూడుకున్న ఉద్యోగమని, ఇక్కడ అందరినీ ఒకేలా మెప్పించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికే ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కమిషన్‌పై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని వాటిని అభ్యర్థులు నమ్మవద్దని కోరారు. టీజీపీఎస్సీ అనేది చాలా క్లిష్టమైన బాధ్యతలతో కూడుకున్న ఉద్యోగమని, ఇక్కడ అందరినీ ఒకేలా మెప్పించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికే ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కమిషన్‌పై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని వాటిని అభ్యర్థులు నమ్మవద్దని కోరారు.













Click it and Unblock the Notifications