ఇండియాకు తిరిగొస్తున్నా-ఆందోళనలకు తేదీ ఫిక్స్ చేసిన కాక్రోచ్ బాస్..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సోషల్ మీడియాలో కేంద్రాన్ని పదే పదే పోస్టులు, వీడియోలతో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఎక్స్ లో, ఇన్ స్టాగ్రామ్ లో పలుమార్లు అకౌంట్ బ్లాక్ చేశారు. దీంతో పాటు కంటెంట్ కూడా ఎక్కువ మందికి చేరకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో కీలకమైన నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ అవకతవకలపై విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబడుతున్న సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే (Abhjeet Dipke) ఇప్పుడు నేరుగా ప్రజ్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేయడానికి భారతదేశానికి తిరిగి వస్తున్నానంటూ అభిజిత్ దిప్కే ఇవాళ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడానికి, జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొనవలసిందిగా భారత యువతను ఆయన కోరారు. ఈ మేరకు ఆయన జూన్ 6న అమెరికా నుంచి భారత్ కు తిరిగి రానున్నారు.

భారత రాజ్యాంగ మార్గాన్ని అనుసరిస్తూ, మనమందరం ఏకమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శాంతియుతంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మనమందరం కలిసి గళం విప్పితే, వారు తప్పకుండా మన మాట వింటారు," అని దీప్కే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. జూన్ 6న ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి వస్తానని, తనతో కలవాలని మనమంతా కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి కోరదామన్నాడు.సీజేపీ X ఖాతాను తక్షణమే అన్‌బ్లాక్ చేయాలని ఆదేశించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications