సీఎం విజయ్ బిగ్ యూటర్న్: ఆ ఆదేశాలు ఇప్పటికప్పుడు వెనక్కి

తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన విమర్శలు, ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమైనట్లు తెలుస్తోంది.

విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి ఈ విషయాన్ని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలంటూ గతంలో పంపిన విద్యాశాఖ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సర్కులర్ ను అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించినట్లు వివరించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆందోళనలపై ఉన్న ఈ ఆజ్ఞలు రద్దయినట్లయింది.

Tamil Nadu Government Withdraws Order Blocking Students From CJP Leftiest Led Protests After Outcry

తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు అలాగే ఉన్నత విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం ఈ సర్కులర్ ను పంపింది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఎలాంటి రాజకీయ ప్రదర్శనల్లో పాలుపంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లు, రిజిస్ట్రార్లను ఆదేశించింది. విద్య, పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కలిసి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలని సూచించింది.

ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎం
ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎం

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వివాదాస్పద ఆంక్షలను విపక్ష కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. ఈ నిబంధనలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమని అభివర్ణించారు. ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అలాంటి హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. దీంతో సర్కారుపై రాజకీయ ఒత్తిడి పెరిగింది.

సీఎం విజయ్ వరాల మూట: ఒక్కటి కాదు..: ప్రతి ఎమ్మెల్యేకూ ప్రభుత్వ కారు, రూ. 25 లక్షల కవరేజ్
సీఎం విజయ్ వరాల మూట: ఒక్కటి కాదు..: ప్రతి ఎమ్మెల్యేకూ ప్రభుత్వ కారు, రూ. 25 లక్షల కవరేజ్

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ఈ ఉత్తర్వులు వెలువడటం కూడా వివాదాస్పదంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నీట్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో విద్యార్థులను ఆందోళనలకు దూరం పెట్టాలని ప్రభుత్వం భావించడం తీవ్ర దుమారానికి దారితీయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

కాచిగూడ నుంచి బయలుదేరి వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ఇకపై
కాచిగూడ నుంచి బయలుదేరి వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ఇకపై
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+