వాహనదారులకు గుడ్‌న్యూస్: E20 వివాదంపై కేంద్రం కొత్త ప్లాన్!

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ రంగానికి చెందిన పరిశ్రమల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ20తో పాటు మార్కెట్లో ఈ10 పెట్రోల్‌ను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురావాలా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది.

సన్నీ లియోన్ వ్యాపారాలు, వాటి టర్నోవర్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్
సన్నీ లియోన్ వ్యాపారాలు, వాటి టర్నోవర్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్

భారత్ అనుకున్న గడువు కంటే దాదాపు ఐదేళ్ల ముందే అంటే గతేడాదే పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌నే ప్రామాణిక ఇంధనంగా విక్రయించడం ప్రారంభించారు. అయితే ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన వాహనాలు ఈ ఈ20 ఇంధనానికి అనుగుణంగా డిజైన్ చేయబడలేదు. దీని వల్ల పాత వాహనాలలో మైలేజ్ గణనీయంగా తగ్గడం, రబ్బర్ పార్ట్స్, ఇంజిన్ భాగాలు పాడవుతున్నాయనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల పాత వాహనాల్లో 3 నుంచి 6 శాతం వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా పార్లమెంట్‌లో అంగీకరించింది.

E20 Petrol Controversy Central Government Considers Reintroducing E10 Petrol for Older Vehicles

ప్రస్తుతం మార్కెట్లో వాహనదారులకు పెట్రోల్‌ను ఎంచుకునే ప్రత్యామ్నాయం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత కార్లు లేదా బైకులు ఉన్నవారు తమ వాహనానికి సరిపోయే ఈ10 పెట్రోల్‌ను వాడదామన్నా.. బంతుల్లో అది లభించడం లేదు. దీనిపై ప్రతిపక్ష నాయకులు, వాహనదారుల సంఘాలు వరుసగా ప్రశ్నలు గుప్పించాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ కూడా ఇటీవల ఒక వ్యాసంలో మిలియన్ల కొద్దీ పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను ఈ20తో పాటు సమాంతరంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రివ్యూ- ట్యాక్స్ కట్
స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రివ్యూ- ట్యాక్స్ కట్

పాత వాహనదారుల ప్రధాన ఆందోళన
వాహన రంగానికి చెందిన రూల్స్ ప్రకారం.. ఏప్రిల్ 2023 తర్వాత తయారైన బీఎస్6 ఫేస్-2 వాహనాలన్నీ ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కానీ అంతకంటే ముందు కొనుగోలు చేసిన కోట్లాది వాహనాల పరిస్థితి ఏంటనేదే ప్రధాన సమస్య. ఉదాహరణకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పెట్రోల్ వాహన కాలపరిమితి 15 ఏళ్లు. మార్చి 2023లో కొన్ని కొత్త కారు 2038 వరకు నడిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ20 పెట్రోల్ వల్ల కేవలం 3-4 ఏళ్లకే ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని యజమానులు వాపోతున్నారు.

పరిశ్రమలతో ప్రారంభమైన సాంకేతిక చర్చలు
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కేంద్ర సర్కారు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ10ని తిరిగి బంకులకు తీసుకురావడంలో ఉన్న సాంకేతిక, లాజిస్టిక్స్ సవాళ్లపై చర్చలు కొనసాగుతున్నాయి. అధికారిక నిర్ణయం ఇంకా వెలువడనప్పటికీ.. త్వరలోనే ఈ10, ఈ20 రెండింటినీ బంకుల్లో లభించేలా చర్యలు తీసుకుంటారని వాహనదారులు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+