స్టార్ యాక్టర్ కటౌట్ కు తగ్గ గెటప్: టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ మైథలాజికల్ థ్రిల్లర్
హనుమాన్ చిత్రంతో టాలీవుడ్ లో నూతన ఒరవడి సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తోన్నారు. అదే సమయంలో మరో సినిమాను కూడా ప్రకటించారు. తన సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై ఆయన పర్యవేక్షణలో రాబోతోందీ భారీ పౌరాణిక చిత్రం. ఈ మూవీ టైటిల్.. మహాకాళి. ఈ నెల 24వ తేదీన ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. దీనిపై ప్రశాంత్ వర్మ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు.
"ఆగస్ట్ 2024- ది ఎండ్ బిగిన్స్" అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రకటించారు. దీనికి ఓ స్టిల్ ను కూడా యాడ్ చేశారు. శుక్రాచార్యుడి స్టిల్ అది. అందులో ఉన్నది మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా. ఛావాలో ఔరంగజేబ్, ధురంధర్ లో రెహ్మాన్ డకైట్, బోర్డర్ 2లో లెప్టినెంట్ ధరంవీర్ భక్రి, ఇక్కాలో శౌర్యమాన్ గౌర్ పాత్రలతో దేశవ్యాప్తంగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆయన పోషించిన ఈ క్యారెక్టర్లు లేకపోతే సినిమానే లేదనే రేంజ్ లో గుర్తింపు వచ్చిందాయనకు.

ఇప్పుడు మహాకాళిలో నటిస్తోన్నారు. శుక్రాచార్యుడిగా కీలక పాత్రను పోషిస్తోన్నారు. పురాణాల ప్రకారం అసురుల గురువు శుక్రాచార్యుడు. ఈ క్యారెక్టర్ చుట్టే మహాకాళి కథ తిరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గుర్తు పట్టని విధంగా తనను తాను మలచుకున్నారు. ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోందీ మహాకాళి ఫిల్మ్.
ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దీనికి మూలకథను అందిస్తోన్నారు. సినిమాటిక్ విశ్వాన్ని క్రమంగా విస్తరిస్తోన్నారు. ఆర్ కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కబోతోంది. రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్ సినిమాను నిర్మిస్తున్నారు. హనుమాన్ తరహాలోనే సరికొత్త సాంకేతికత, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది.
THE END BEGINS!
— Prasanth Varma (@PrasanthVarma) August 19, 2026
24-08-26#Mahakali🔱 #AkshayeKhanna pic.twitter.com/pZEtuvLQss
ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం నటీనటుల ఎంపిక సైతం పూర్తయింది. భూమి షెట్టి, రోహిత్ ష్రాఫ్, శ్రియా రెడ్డి, సముద్రఖని, నాజర్, రజత్ కపూర్, రాకేశ్ బేడీ, మురళీ శర్మ, పృథ్వీరాజ్ తదితర నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిసిపోనున్నారు. ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న ప్రత్యేక గ్లింప్స్ ద్వారా ఈ మహాకాళి సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి విజువల్స్ బయటకు రానున్నాయి.













Click it and Unblock the Notifications