జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ.. సోషల్ మీడియాలో ఆ వీడియోల రచ్చ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన చేసిన సంచలన ఆరోపణలు తన పైన గృహహింస జరిగిందని, హత్యాయత్నం చేశారని పెట్టిన కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ కుటుంబ వివాదం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తుంది.

ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!
ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!

జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ

కుటుంబ పంచాయతీ సమయంలో రికార్డైన వీడియోలు, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన భార్యతో మాట్లాడిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీరి ఫ్యామిలీ పంచాయితీ పైనే ఉంది. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్‌కు తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనతో 2025 మేలో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల్లోనే వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆరోపించారు.

Jogi Ramesh family dispute videos go viral on social media jogi rajeev and his wife meghana shocking comments

రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్ అంటూ మేఘన సంచలన ఆరోపణలు

అంతేకాదు తన భర్త రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్, తను నన్ను ఫిజికల్ గా సాటిస్ ఫై చేయలేడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అదనపు వరకట్నం రూ.5 కోట్లు తేవాలని డిమాండ్ చేశారని, గృహహింస, హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ సహా 11మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేశారు.ఇరువైపుల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రాజీవ్ తన తండ్రిపై తీవ్రంగా మండిపడ్డారు.

నౌకాదళంలోకి 'మచిలీపట్నం'! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..
నౌకాదళంలోకి 'మచిలీపట్నం'! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..

ఆమె ఫోటో చూసినప్పుడే పెళ్లి వద్దన్నాను .. జోగి రమేష్ పై కొడుకు సీరియస్

"ఆమె ఫొటో చూసినప్పుడే పెళ్లి వద్దని చెప్పాను. ఆమెను చూస్తే తనకు ఏ ఫీలింగ్ లేదని చెప్పినా, నువ్వే బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశావు" అని ఆయన అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు జోగి రాజీవ్ స్వయంగా ఆమెను నేను సాటిస్ ఫై చెయ్యలేను అని వ్యాఖ్యలు చేయటం కూడా బాగా వైరల్ అవుతుంది. అత్త శకుంతల డబ్బు, బంగారం డిమాండ్ చేసినట్లు ఆడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి.

వీడియోలు బయటకు రావటంతో జోగి ఫ్యామిలీకి ఇబ్బంది

ఇక జోగి రాజీవ్ భార్య మేఘన తో మాట్లాడిన ఆడియోలో మీ ఇంట్లో నువ్వు ఉండు , మా ఇంట్లో నేను ఉంటాను అంటూ, నీకు నాకు సంబంధం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు బయటకు రావడంతో జోగి రమేష్ కుటుంబం ఇబ్బందికర పరిస్థితిలో పడింది.

సోషల్ మీడియాలో జోగి బతుకు జట్కా బండి అంటూ పోస్టులు

రాజకీయాల్లో బలంగా మాట్లాడే జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు సొంత ఇంటి వివాదాలతో సామాజిక మాధ్యమాల్లో టార్గెట్ అవుతున్నారు. కూటమి కార్యకర్తలు జోగి రమేష్ ను కుటుంబ పంచాయతీ నేపథ్యంలో టార్గెట్ చేస్తున్నారు. జోగి రమేష్ బతుకుజట్కబండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు కోడలు మేఘన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+