US Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు షాక్! తాజా రూల్స్-కీలక ప్రకటన..!

భారతీయులు ఒకప్పుడు కలగా భావించిన అమెరికా ప్రయాణాలు, అక్కడి వీసాలు, గ్రీన్ కార్డుల్ని ట్రంప్ సర్కార్ రానురానూ మరింత కఠినంగా మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులు, ఇతర వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా తీసుకొస్తున్న గ్రీన్ కార్డు నిబంధనల్ని (US Green Card Rules) ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 18 నుండి అమలులోకి రానున్నాయి. దీని ప్రభావం పర్మనెంట్ రెసిడెన్సీ దరఖాస్తులపై తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ సాయం పొందుతున్న వలసదారులకు కష్టాలు తప్పవు.

తాజా గ్రీన్ కార్డ్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ దరఖాస్తులకు (ఫారం ఐ-485) మాత్రమే కొత్త మార్గదర్శకాలు వర్తింపజేస్తారు. గడువు ముగిసిన తర్వాత పాత వెర్షన్ ఫారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వీకరించరు. దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్య స్థితి, నిధులు, విద్య, విభిన్న నైపుణ్యాల ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు. వలసదారులు తమ స్వయం సమృద్ధిని నిరూపించుకోవడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. ఈ సవరణల వల్ల పబ్లిక్ ఛార్జ్ పరిధి చాలా విస్తృతంగా మారనుంది. సెప్టెంబర్ 18 తర్వాత వలసదారులు పొందే ప్రభుత్వ ప్రయోజనాలు వారి అర్హతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

US Green Card Rules New Changes From September 18 Could Make Approval Harder for Applicants
US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?
US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?

గతంలో తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ నగదు రూప సహాయం, వైద్య సంస్థలలో దీర్ఘకాలిక చికిత్స వంటి వాటిని మాత్రమే దీనికి పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇకపై హౌసింగ్ అసిస్టెన్స్, ఫుడ్ స్టాంప్స్, కాలేజీ చదువుల కోసం ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా దరఖాస్తు తిరస్కరణకు ప్రాతిపదికగా మార్చనున్నారు. కుటుంబ ఆధారిత వలసల విషయంలో స్పాన్సర్ల అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ (ఫారం ఐ-864) మరింత కీలకంగా మారింది. గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తికి పూర్తి ఆర్థిక రక్షణ కల్పించే సామర్థ్యం తమకు ఉందని స్పాన్సర్లు కచ్చితంగా నిరూపించాల్సి ఉంటుంది. అయితే శరణార్థులు, రాజకీయ ఆశ్రయం పొందినవారు, మానవతా కోణంలో ప్రత్యేక వీసాలు కలిగిన వారికి మాత్రం ఈ నిబంధనల నుండి పూర్తి మినహాయింపు ఇస్తారు.

US Green Card Rules New Changes From September 18 Could Make Approval Harder for Applicants
US-Iran War: ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్ - అవన్నీ ఆయన భ్రమలే..!
US-Iran War: ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్ - అవన్నీ ఆయన భ్రమలే..!

మరోవైపు కేవలం పబ్లిక్ ఛార్జ్ నిబంధన కారణంగా గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వస్తే, అధికారులు తమ విచక్షణతో ఫారం ఐ-945 కింద పబ్లిక్ ఛార్జ్ బాండ్ సమర్పించే అవకాశాన్ని కల్పించవచ్చు. ఈ బాండ్ నిబంధనలను అతిక్రమిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలని భావించే భారతీయ కుటుంబాలు ఈ మార్పులను ముందే గ్రహించి, దరఖాస్తు ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+