తెలంగాణపై సీమాంధ్ర నేతల్లో మార్పు?

ఇదిలావుంటే, తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలకు నాయకత్వం వహించిన కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వైఖరి కూడా మారినట్లు కనిపిస్తోంది. తెలంగాణపై తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కూడా కాస్తా మెతగ్గానే మాట్లాడినట్లు కనిపించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని అన్నారు.
అయితే, సీమాంధ్ర నాయకుల్లో నిజంగానే మార్పు వచ్చిందా, తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందనే సంకేతాలు అందాయా అనేది కూడా సందేహంగానే ఉంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుండా, తెలంగాణ కోసం చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే, తెలంగాణ పట్ల కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు తెలంగాణ పట్ల మెతగ్గా మాట్లాడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశాలున్నట్లు, ఆయన ఢిల్లీ పర్యటనలో దీనిపైనే ప్రధాన చర్చ జరిగిందని అంటున్నారు. తాము అనుకున్నది సాధించిన తర్వాతనే సీమాంధ్ర నాయకులు తెలంగాణ పట్ల సానుకూలంగా మాట్లాడుతుండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications