తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా

తెలంగాణ అంశంపై అధిష్టానం పెద్దలతో చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగావకాశాలే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోయినా కట్టుబడి ఉంటారా అని అడిగితే ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో విద్య, ఉద్యోవకాశాలు మెరుగుపడాలని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం అందరి అభిప్రాయాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి, తెలంగాణ అంశానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు పాలనా దక్షత ఉంది కాబట్టే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications