ఎప్సన్ నుండి ఇంక్ ట్యాంక్ సిస్టమ్ ప్రింటర్లు

'ఎల్100' బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్‌లోని ఇంక్ ట్యాంక్‌లో 70 ఎంఎల్ ఇంక్‌తో 4000 పేజీలు ప్రింట్ చేయవచ్చని, ఒక్కో పేజీకి అయ్యే ఖర్చు కేవలం 10 పైసలు మాత్రమేనని వివరించారు. అదేవిధంగా ఎల్200 ఆల్ ఇన్ వన్ కలర్ ప్రింటర్‌లోని మూడు ఇంక్ ట్యాంకుల్లో ఒక్కో దాన్లో 70 ఎంఎల్ ఇంక్ ద్వారా 6500 కలర్ పేజీలు ప్రింట్ చేయవచ్చని ఇక్కడ ఒక్కో పేజీకి 20 పైసలు ఖర్చు అవుతుందని తెలిపారు. సాధారణ క్యాట్రిడ్జ్ ప్రింటర్లలో ఉండే సమస్యలు- నకిలీ ఇంక్ క్యాట్రిడ్జ్ వల్ల ప్రింటర్ చెడిపోవడం... వంటివి ఇందులో ఉండవని పేర్కొన్నారు. ఎల్100 ప్రింటర్ ధర రూ. 8,999, ఎల్200 ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ధర రూ. 10,999 ఉన్నట్లు సాంబమూర్తి వెల్లడించారు.












Click it and Unblock the Notifications