వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం ఏక్తా దీక్షకి టిడిపి నేతలు హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం రాజధాని హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తన ఏకతాదీక్షను ఉదయం ప్రారంభించారు. నాగం దీక్షను ప్రముఖ స్వతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగం మొదట దివంగత ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేశారు. అనంతరం ఆయన తన దీక్షను ప్రారంభించారు. నాగం దీక్షలో తెలుగుదేశం పార్టీ నేతలు జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి పాల్గొన్నారు. విమలక్క, పొత్తూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

కాగా జెండాలు, అజెండాలకు అతీతంగా తెలంగాణలోని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు అంతా ఏకమవ్వాలంటూ నాగం రెండు రోజుల నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. తెలంగాణ నేతలను ఏకం చేయడమే తన లక్ష్యమని నాగం దీక్ష ప్రారంభం సందర్భంగా చెప్పారు.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy started ekta deeksha today at Indira Park of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X