మొబైల్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించిన చైనా టెలికమ్

ప్రస్తుతం ఈ సర్వీస్ బీజింగ్‌లో ఉన్న ప్రజలు ఎవరైతే తమయొక్క సిమ్ కార్డ్‌ని మొబైల్ పేమెంట్ కార్డ్ (యూజర్ ఐడెంటిటీ మోడల్) విధానానికి మార్చుకున్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఇది చాలా స్పెషల్ సిమ్ కార్డ్ కావడం మాత్రమే కాకుండా చైనా టెలికామ్, చైనా యూనియన్ పే రెండు కలసి సంయుక్తంగా దీనిని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సర్వీస్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా మీ యొక్క మొబైల్ పేమెంట్స్ జరిగే వీలుగా దీనిని రూపోందించడం జరిగిందని అన్నారు. అంతేగానీ దీనికోసం ఎటువంటి హార్డ్‌వేర్ అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఈ యూజర్ ఐడెంటిటీ మోడల్‌తో కస్టమర్స్ వారియొక్క అన్ని రకాల బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌ని కొనసాగించవచ్చునని తెలియజేశారు. మొబైల్ పేమెంట్స్ విషయంలో చైనా ఓ పెద్ద హాట్ మార్కెట్. ఇందులో భాగంగానే ఆలీబాబా ఆన్ లైన్ పేమెంట్ ఫ్లాట్ ఫామ్‌ని మొబైల్‌కి అనుగుణంగా అప్లికేషన్‌ని అప్‌గ్రేడ్ చేయడమైంది.












Click it and Unblock the Notifications