హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యవాణికి సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao-Devineni Umamaheswara Rao
హైదరాబాద్‌‌: ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని ఎంఐఎం, సీపీఎం మినహా అన్ని పార్టీలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్ాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర వాదనలు బలంగా వినిపించేందుకు వీలుగా సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈలోగా తెలంగాణ నేతల మాదిరిగానే తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని కూడా వారు ఆలోచిస్తున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని, వీలైతే మంత్రుల చేత కూడా రాజీనామా చేయించాలని వ్యూహం ఖరారు చేస్తున్నట్లు తెలిసింది.

సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌ శైలజానాథ్‌ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మరికొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్ర టీడీపీ కూడా ఆందోళనకు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటన తరువాత సీమాంధ్రలో జనజీవన స్తంభించేలా ఉద్యమాలు కొనసాగివ విషయం తెలిసిందే. ఇదే తరహా ఉద్యమాలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సమైక్యాంధ్రకు అనుకూలంగా లాబీయింగ్‌ చేసేందుకు కాంగ్రెసు నేతలు ఈ నెల ఐదో తేదీనే వీరు ఢిల్లీకి వెళ్లాలని తొలుత వీరు నిర్ణయించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి రావద్దని అధిష్ఠానం సూచించడంతో దాన్ని వాయిదా వేసుకొన్నారు.

టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో సీమాంధ్ర టీడీపీ నేతలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయనగరంలో దేవినేని సమైక్యాంధ్ర ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా సీమాంధ్రలో ఏ పార్టీకి ఆ పార్టీ స్వతహాగా సమైక్య ఉద్యమంతో ముందుకెళ్లాలని నిశ్చయించాయి. గత ఏడాది డిసెంబర్‌ తొమ్మిది తరువాత చేపట్టిన ఉద్యమం తరహాలోనే మళ్లీ ఉద్యమించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

English summary
Seemandhra Congress and TDP leaders are in a plan to resign opposing division of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X