సీమాంధ్రలో రగిలిన సమైక్యాంధ్ర ఆందోళనల అగ్గి

విశాఖపట్నంలో రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.పశ్చిమగోదావరి ఏలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా వసంతనగర్ సెంటర్‌లో టీడీపీ రాస్తారోకో నిర్వహించింది.విజయనగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కోర్టు దగ్గర న్యాయవాదులు మానవహారం చేశారు.పార్వతీపురంలో టీడీపీ ధర్నా నిర్వహించింది.నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర కోసం హైవేపై విద్యార్ధి జేఏసీ ధర్నా, రాస్తారోకో చేపట్టింది. ప్రకాశం జిల్లాలో సమైక్యాంధ్ర కోసం ఒంగోలు బైపాస్ రోడ్డులో విద్యార్ధులు రాస్తారోకో నిర్వహించారు. కాగా వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్ధులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని ముదిగొబ్బిలో సమైక్యాంధ్రకోసం విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు. కదిరిలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. జిల్లాలో జేఏసీ ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. ఎస్వీయూలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పీలేరులో ఎస్ఎస్‌యూఏ ర్యాలీ చేపట్టింది.












Click it and Unblock the Notifications