భవిష్యత్తులో దాడులని నిరోధించడానికి అన్నీ చేస్తాం: పిఎం

Manmohan Singh
ముంబై: ఉగ్రవాద దాడులను నిరోధించడానికి చేయాల్సిందంతా చేస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూస్తామని ఆయన అన్నారు. ముంబై దాడులను కిరాతక చర్యగా ఆయన అభివర్ణించారు. పరిస్థితిని పరిశీలించడానికి ఆయన గురువారం ముంబై వచ్చారు. ముంబై ప్రజల బాధను, ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రెండు లక్ష రూపాయలేసి, గాయపడినవారికి లక్ష రూపాయలేసి నష్టపరిహారాన్ని తాను ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు.

ఉగ్రవాదుల కిరాతక చర్యలను ఖండించడానికి తన వద్ద పదాలు లేవని ఆయన అన్నారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వచ్చిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దాడులకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూడడంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమన్వయంతో పనిచేస్తారని ఆయన చెప్పారు. తమ కృషిలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించి, జీవన విధానాన్ని దెబ్బ తీయడానికి ఐక్యత, శక్తి పనిచేస్తాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+