వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైయస్'దే అవినీతి పాపం!: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
చిత్తూరు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వేసిన సిబిఐ దర్యాఫ్తులో ఏదైనా అవినీతి ఉందని తేలితే ఆ పాపం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గమే బాధ్యత వహించాలని ఓ పెళ్లికి హాజరైన అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. సిబిఐ దర్యాఫ్తుతో తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఏదైనా అవినీతి తేలితే అధి వైయస్ అండ్ కో కే చెందుతుందన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు సహకరిస్తామని చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని కొందరు ఉద్దేశ్య పూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ ఎప్పటికీ ఇబ్బందులకు గురి కాడన్నారు. ఆయనను ఎంతగా అణగ దొక్కాలనుకుంటే అంత ఎత్తుకు ఎదుగుతాడని అన్నారు. అవినీతి తేలితే వైయస్ హయాంలోని మంత్రివర్గంలోని అందరిది సమిష్టి బాధ్యత అన్నారు. కొందరు జగన్‌ను విమర్శించి పదవులు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.

English summary
Ambati Rambabu blamed late YS Rajasekhar Reddy and his cabinet for if any corruption will found in CBI probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X