సిఎంకు అది సహజమే: కిరణ్‌పై కెకె మండిపాటు

తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన మరో సైనిక్ స్కూలును సిఎం తన సొంతూరుకు తరలించుకు పోతున్నారని ఆరోపించారు. తన అవసరాల కోసం మంత్రులను, ఇతర నేతలను సిఎం పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఎలాంటి చర్యలు అవసరం లేదన్నారు. తెలంగాణ సాధన కోసం అంటే చర్చిస్తామన్నారు. విడిపోవాలని మేం నిర్ణయించుకున్నామని ఇక నిర్ణయం తీసుకోవాల్సింది సీమాంధ్ర ప్రజాప్రతినిధులే అన్నారు. తెలుగువారే సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలలో తప్పులేదన్నారు.
ఇటలీ కాంగ్రెసు అన్న నేతలను వెంటబెట్టుకొని తిరిగే నేతలకు మాట్లాడే హక్కు లేదన్నారు. శతాబ్దాలుగా కలిసి ఉండాలన్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలకు అర్థం సమైక్యాంధ్రగా ఉండాలని అర్థం కాదన్నారు. ఆజాద్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా అనుకోవద్దన్నారు. తెలంగాణపై అధిష్టానం స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే ఢిల్లీ వెళ్లేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు.